వ్యాయామం వలన అనారోగ్యాలు దరిచేరకుండా, ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మిస్టర్ యూనివర్స్ వరల్డ్ ఛాంపియన్, ఇండియన్ బాడీ బిల్డర్ సంగ్రామ్ చౌగిలే అన్నారు. షేక్ పేట టోలిచౌకి లో నూతనంగా ఏర్పాటు చేసిన ” సాలిటర్ ఫిట్నెస్ సెంటర్ ” ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా సంగ్రామ్ మాట్లాడుతూ, నేటి యాంత్రిక జీవనం లో ఎన్నో ఒత్తిడులకు గురవుతున్న నేటి తరానికి విభిన్న రకాల వ్యాయామం అవసరం అని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని పాటిస్తూ “సాలిటర్” తరాల వ్యాయామం చెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు.’
సంస్థ ఆపరేషనల్ మేనేజర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ నగరం లో 5 ప్రాంతాల్లో తమ సంస్థ సేవలను అందిస్తుందని, షేక్ పేట ప్రాంత వాసులకు అందుబాటులో “సాలిటర్” ను ఏర్పాటు చేశామని తెలిపారు, “ఈ రంగంలో నిష్టాతులచే వ్యాయామంతో పాటు కార్డియో, వెయిట్ మేనేజిమెంట్, స్టీమ్ అండ్ షెవర్ వంటి అనేక సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు”.