మూవీ లెజెండ్ మెహన్ లాల్ మలయాళం లో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ “ఓడియన్”. ఈ చిత్రానికి అక్కడే కాకుండా తెలుగు ట్రేడ్ లో కూడా చాలా మంచి క్రేజ్ వుంది. ఈ చిత్రం కోసం మెహన్ లాల్ గారు యెగా మరియు వ్యాయామాలు చేసి తన వయసుని 55 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని నటించిన చిత్రం కావటం.. అద్బుతమైన గ్రాఫిక్స్ తో నిర్మిస్తుండటంతో ఈ క్రేజీ ప్రాజెక్టు కి సౌత్ ఇండియా అంతా హ్యూజ్ క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది బడా నిర్మాతలు పోటిపడినా కూడా దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన దగ్గుపాటి అభిరామ్ గారు, సంపత్ కుమార్ గారు ఈ చిత్రం తెలుగు హక్కులు పొందటం విశేషం. ఈ అవకాశాన్ని అందించిన మెహన్ లాల్ గారికి నిర్మాతలు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగులో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. మోహన్ లాల్ గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్టామినా ఎంతో చాలా సినిమాల్లో చూసాం. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఆయన నటిస్తున్న ఓడియన్ చిత్ర తెలుగు హక్కుల్ని మా దగ్గుబాటి క్రేయేషన్స్ సొంతం చేసుకుంది. సినిమా కున్న క్రేజ్ దృష్ట్యా భారీ కాంపిటీషన్ నడుమ ఈ సినిమా హక్కులు పొందాం. దర్శకుడు శ్రీ కుమార్ మీనన్ మోహన్ లాల్ గారిని 35 సంవత్సరాల వయసున్న వైవిధ్యమైన పాత్రలో చూపించనున్నారు. దీనికోసం మోహన్ లాల్ గారు యోగాసనాలు వంటి ప్రక్రియలు 55 సంవత్సరాల వయస్సులో చేయడం హ్యాట్సాఫ్. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమా హక్కులు మాకు ఇచ్చినందుకు మోహన్ లాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మలయాళం తో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నాం. అని అన్నారు.