Ysrcp Leader Jagan Mohan Reddy arrived at Visakhapatnam Airport,Vizagvision..
విశాఖ చేరుకోన్న ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్.
విశాఖ విమానాశ్రయం లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి వైకాపా పార్టీ శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేత వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కోలుకొని ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు తొలిసారిగా ఆదివారం సాయంత్ర విశాఖ చేరుకున్న ఆయనకు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు ప్రాంగణం కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులతో జనసంద్రమైంది.జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తో విమానాశ్రయ ప్రాంగణం దద్దరిల్లింది. నేరుగా విజయనగరం ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు.