విశాఖ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు… దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వి .మాడుగుల మండలం కేజే పురం గ్రామానికి చెందిన బీసెట్టి జగ్గారావు తన కుటుంబానికి చెందిన 9 ఎకరాల భూమిని పట్టాదారు పాసు పుస్తకాల నిమిత్తం వీఆర్వో రామకృష్ణ సంప్రదించగా పట్టాదారు పాసుపుస్తకం కావాలంటే తలకు 9000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు… ఇది ఇష్టంలేని జగ్గారావు విశాఖ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు…. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ బృందం వలపన్ని ఈరోజు మాడుగుల తాసిల్దార్ కార్యాలయం వద్ద రైతు జగ్గారావు దగ్గర నుండి 9000 నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు…