శ్రీ అయ్యప్ప స్వామి మండల పూజల ప్రారంభాన్ని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ లోని …శ్రీధర్మ శాస్తా ఆలయంలో …పడిపూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శబరిమలలో చేసే విధంగానే …ఇక్కడ కూడా తాంత్రిక పద్ధతిలో శ్రీ మురళీ ధరన్ నంబూద్రి, శ్రీ రాజీవ్ నంబూద్రీలు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీ అయ్యప్ప స్వామి వారికి పూలతో విశేషంగా పూలాభిషేకం నిర్వహించారు. అలాగే రామకృష్ణ గురుస్వామి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన భజన గానామృతం అలరించింది…ప్రాంగణమంతా శ్రీ అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది….