శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా పడిపడి లేచే మనసు. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుద లకానుంది. విడుదలకు నెల ముందే ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడయ్యాయి. ఈ మూడు రైట్స్ కలిపి 12 కోట్లకు అమ్మేసారు నిర్మాతలు. డిజిటల్ రైట్స్ అమేజాన్ ప్రైమ్ వీడియో.. స్టార్ మా ఛానెల్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారు. హీరో శర్వానంద్ కెరీర్ లో భారీ మొత్తానికి అమ్ముడైన సినిమా ఇదే. కోల్ కత్తా నేపథ్యంలో తెరకెక్కుతోన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ పడిపడి లేచే మనసు. హను రాఘవపూడి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మురళి శర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో సుధాకర్ చెరుకూరి పడిపడి లేచే మనసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు:
శర్వానంద్, సాయిలప్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: హను రాఘవపూడి
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫర్: జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: A శ్రీకర్ ప్రసాద్
కొరియోగ్రఫీ: రాజు సుందరం
లిరిక్స్: కృష్ణకాంత్
పిఆర్ఓ: వంశీ శేఖర్