YSRCP Demands to Government CBI Enquiry,Visakhapatnam,Vizagvision…విశాఖలో వెలుగు చూస్తున్న కబ్జాలపై సిబిఐ విచారణకు పట్టుబడుతున్న వైకాపా విశాఖలో మహాధర్న చేపట్టేందుకు సిద్దమవుతోంది…ఏపీ ప్రతిపక్ష నేత జగన్ సమక్షంలో మహాధర్నా చేపట్టాలని నిర్ణయానికి వచ్చిన వైసీపీ నేతలు కేంధ్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై భూ దందాలపై విచారణకు ఒత్తిడి తెస్తామని వైకాపా జిల్లా అద్యక్షుడు అమర్ అన్నారు…మహాధర్నా తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జిల్లా అమర్ తెలిపారు…భూ వివాదంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి గంటా శ్రీనివాస్ రావు అనతి అనుచరులు కలసి భీమిలి ప్రాంతాంలో ప్రభుత్వ భూములను కాజేసి జేబులు నింపుకుంటున్నారని అన్నారు…జిల్లా రూరల్ ప్రాంతంలో 11 మండలాల్లో భూ దందాలు కొనసాగుతున్నాయని ప్రాధమికంగా అంచనా వేసిన అధికారుల నివేదికకు విభిన్నంగా కేవలం మదురవాడ పరిసర ప్రాంతాల్లో విచారణ చేయ్యడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన .. కచ్చితంగా అన్యాక్రాంతమవుతున్న భూ దందాపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు…చిత్తుశుద్ది ఉంటే కచ్చితంగా ప్రభుత్వం విచారణ జరిపాలని సవాల్ విసిరారు…