జాగృతి సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలనుండి జాగృతి యాత్రను నిర్వహించుచున్నారు. ఈ యాత్రలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామిక రంగములో ఆసక్తిగలిగిన 500 మంది యువతీ, యువకులను జాగృతియాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర ముంబయినగరంలో ఈ నెల 24 వ తేదీన ప్రారంభమై, దేశములోని 12 మహానగరాలను సందర్శించేదానికోసం 18 భోగీలు కలిగిన ఒక ప్రత్యేక ట్రైన్ లో ఈ రోజు అనగా ౩౦వ తేదీ ఉదయం 11 గం.కు విశాఖపట్నం కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని అక్షయపాత్ర ఫౌండేషన్ వంటసాలకు చేరుకున్నారు.
ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం యువ పారిశ్రామిక వేత్తలను తయారుచేయడం. ఈ యాత్రలో భాగంగా మధురైలోని అరవింద్ కంటి ఆసుపత్రి, బెంగుళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ, మద్రాసులోని ఇంఫీల్డ్ కర్మాగారం మరియు విశాఖపట్నం లోని అక్షయపాత్ర ఫౌండేషన్లను సందర్శించారు.
అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యములో దేశవ్యాప్తంగా 17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనమును ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యముతో గత 18 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమాన్ని తెలుసుకున్నటువంటి జాగృతియాత్ర నిర్వాహకులు అక్షయపాత్ర ఫౌండేషన్, విశాఖపట్నం ను సందర్శించి, విశాఖపట్నంలో 25 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పధకాన్ని అందిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయడం జరిగినది. ఈ అధ్యయనంలో, అధునాతన యంత్ర పరికరాలతో భోజనం తయారుచేయడం,ప్రత్యేకమైన వాహనాలలో సమయానికి పాఠశాలలకు పంపించడం గురించి తెలుసుకున్నారు. మరియు మధ్యాహ్న భోజన లబ్దిదారులైన విద్యార్థులతో మాట్లాడి భోజనం యొక్క విశిష్టితను తెలుసుకున్నారు.
అక్షయపాత్ర ఫౌండేషన్ వారి “అపరిమిత ఆహరముతో – అపార విద్య” అనే నినాదము వారికి బాగా నచ్చినది అని తెలియజేసినారు. వంటశాలలో అధునాతన యంత్రసామగ్రి చూసి వారు ముగ్ధులైనారు.
జాగృతియాత్రలో పాల్గొన్న యువతీ, యువకులను ఉద్దేశించి, అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ సత్యగౌరచంద్ర దాస గారు అక్షయపాత్ర ఫౌండేషన్ (ప్రభుత్వ మరియు ప్రైవేటు) భాగస్వామ్యముతో నిర్వహిస్తున్న విధానాన్ని తెలియపరిచారు. యువతీ, యువకులకు యువ పారిశ్రామిక వ్యక్తులుగా తయారుకావటానికి కావలసిన స్ఫూర్తిని ఈ ఉపన్యాసము ద్వారా తెలియజేసారు.
ఈ కార్యక్రమము అక్షయపాత్ర ఫౌండేషన్ విశాఖపట్నం అధ్యక్షులు శ్రీ నిష్కించిన భక్తదాస గారి ఆధ్వర్యములో నిర్వహించడం జరిగినది.ఈ జాగృతి యాత్ర నిర్వాహకులు వరుసగా 6 వసారి గాజువాకలో గల అక్షయపాత్ర ఫౌండేషన్ ను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా జాగృతి యాత్ర నిర్వాహకులను సంస్థ విశాఖపట్నం అధ్యక్షులు శ్రీ నిష్కించిన భక్తదాస గారు అభినందించారు.