J.C Diwaker reddy for flight late argue with Indio staff.Vizagvision….
. విశాఖ ఎయిర్ పోర్టులో ఎంపి జేసీ దివాకర్ రెడ్డి సిబ్బందిపై ఫైర్ అయ్యారు…ఒకింత వీరంగం సృష్టిస్తూ ఘలాటా సృష్టించారు…బోర్డింగ్ ప్రింటర్ ని పక్కకు నెట్టి విమాన సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు…ఆలస్యంగా వచ్చినట్లు చెప్పబడుతున్న ఆయనకు ఇండిగో విమాన సంస్థ సిబ్బంది బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతో ఒంటి కాలిపై లేచి కస్సుబుస్సులాడారు…ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు ఈ ఉదయం ఆయన విమానాశ్రయానికి వచ్చారు.అయితే బోర్డింగ్ పాస్ జారీ సమయం ముగియడంతో సిబ్బంది కౌంటర్ వద్దనే సిబ్బందిపై మండిపడ్డారు…
తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలని సిబ్బందితో ఆయన వాదనకు దిగారు. సమయం ముగిసిందని ఇవ్వడం కుదరదని చెప్పడంతో దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. జేసీ చర్యతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు..దీంతో నారా హైరానా పడ్డ సిబ్బంది తదుపరి చర్యలు తీసుకోవడంతో జేసీ అక్కడ్నుంచి పయణమైయ్యారు…