రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం
టిటిడి జనవరి 31వ తేదీన గురువారం శాస్త్రోక్తంగా భూకర్షణం, బీజవాపన నిర్వహించనుంది.
భూకర్షణంలో భాగంగా గర్భాలయ స్థలాన్ని నాగలితో దున్నుతారు.
అక్కడ నవధాన్యాలు చల్లుతారు.
ధాన్యాలు మొలకెత్తిన తరువాత గోవులకు ఆహారంగా వినియోగిస్తారు.
ఆ తరువాత చదును చేసి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.
ఆలయ నిర్మాణం కోసం టిటిడి జనవరి 28 నుండి 31వ తేదీ వరకు శ్రీనివాస మహాయగ కార్యమ్రాలు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా ఋత్వికులు, అర్చకులు నాలుగు రోజుల పాటు ఆగమోక్తంగా హోమాలు నిర్వహిస్తున్నారు.
భూకర్షణం గురించి మరీచి మహర్షి రచించిన విమానార్చన గ్రంథంలో వివరించారు.
శ్రీనివాస మహాయాగం కోసం 6 హోమగుండాలతో యాగశాలను ఏర్పాటుచేశారు.
మధ్య వేదికపై కుంభంలో శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఆవాహన చేశారు.
ఈశాన్య వేదికపై హోమగుండం ద్వారా 81 మంది అంకురార్పణ దేవతలను ఆవాహన చేశారు.
కుడి వైపున మహాశాంతి హోమగుండాన్ని ఏర్పాటుచేశారు.
ఈ ప్రాంతాన్ని దోషరహితంగా మార్చేందుకు వాయువ్యంలో వాస్తు హోమాన్ని ఏర్పాటుచేశారు.
జనవరి 28న అంకురార్పణతో ప్రారంభించి జనవరి 29న నూతన ఆలయ ప్రదేశంలో భూపరీక్ష నిర్వహించారు.
జనవరి 30న బుధవారం గోపూజ, శ్రీవారి నూతన ఆలయ ప్రదేశంలో వాస్తుహోమం చేపట్టారు.
దీన్నే భూయజ్ఞం అని కూడా అంటారు.
ఈ సందర్భంగా యుగళ వృక్షం కొయ్యతో తయారుచేసిన నాగళకి ప్రత్యేకంగా పూజలు చేశారు.
దీంతోపాటు గోపూజ, కాడి పూజ చేశారు. బుధవారం రాత్రి పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయంతో నాగళికి అధివశం చేస్తారు.
గురువారం మరోసారి కాడి, నాగళి, వృషభ పూజ చేసి పడమర నుండి తూర్పు వైపునకు దున్నుతారు.
ఈ సందర్భంగా పాడిపంటలతో రాష్ట్రం, దేశం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ ప్రాంతంలో నవధాన్యాలు చల్లుతారు
150 కోట్లు వ్యయం
మొత్తం 25 ఎకరాల్లో ఆలయ నిర్మాణం
7 ఎకరాల్లో గుడి నిర్మాణం
మిగిలిన 18 ఎకరాల్లో ఆలయ అనుబంధ నిర్మాణాలు
రాజధానిప్రాతం వెంకటపాలెం లో ఆలయ నిర్మాణం