CPM Ragavallu Demands to Government CBI Enquiry Lands Scam Visakhapatnam,Vizagvision….విశాఖ… సిపిఎమ్ పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ భూకుంభకోణాలపై సిట్ దర్యాప్తు సరిపోదని సిబిఐ తో విచారణ జరిపించాల్సిందే నన్నారు. ఉపముఖ్యమంత్రి కె.ఈ.బహిరంగ విచారణ జరిపిస్తామని చెప్పి మళ్లీ ఎందుకు రద్దు చేశారో అర్దం కావడంలేదన్నారు. మంత్రి అయ్యన్న కూడా భూకుంభకోణం జరగి నట్లు ఒప్పుకున్నారు. దాన్ని విభేదిస్తూ మంత్రి గంటా లేఖరాయడంతో భూకుంభకోణాల్ని మంత్రులమధ్య తగాదాగా చిత్రీలకరించి పార్టీల మధ్య గొడవగా మార్చే ప్రయత్నం చేస్తూ విచారణ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని రాఘవులు ఆరోపించారు. హుదూద్ తుఫానులో భూరికార్డులు గల్లంతయ్యాయని కలెక్టర్ ప్రకటించి తర్వాత మళ్లీ దొరికాయంటూ చేస్తున్న భిన్న ప్రకటనలపై ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందన్నారు.