జయరాం హత్య కేసు: నందిగామకు రాకేశ్ రెడ్డి
కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీకన్సట్రక్షన్ చేయడానికి రాకేశ్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నందిగామకు తీసుకు వస్తున్నారు…
హైదరాబాద్‌లో జయరాంను హత్య చేసిన తర్వాత నందిగామ వరకూ కారులో ఏ విధంగా తీసుకెళ్లారన్న దానిపై సీన్ రీ కన్సట్రక్షన్ చేయనున్నారు. ఇప్పటికే రాకేశ్ రెడ్డి ఇంట్లో సీన్ రీ కన్సట్రక్షన్ చేసిన పోలీసులు… నందిగామలో జయరాం మృతదేహం దొరికిన ప్రాంతానికి అతనిని తీసుకెళ్లి మరిన్ని ఆధారాలు సేకరించనున్నారు.
జయరాం హత్య తర్వాత రాకేశ్ రెడ్డి ఎక్కడెక్కడ ఆగాడు..? ఎవరెవరితో మాట్లాడాడు, ఇలాంటి విషయాలను పోలీసులు ఆరా తీయనున్నారు. జయరాం హత్య కేసులో రాకేశ్‌తో పాటు మరికొందరికి ప్రమేయం ఉండే అవకాశం ఉందని పోలీసుల భావన.. దీనిలో భాగంగా ఇప్పటికే 50 మంది అనుమానితులను విచారించారు. నందిగామలో మరిన్ని అంశాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు
నందిగామ విజయ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద రాకేష్ రెడ్డి జయరాం మృత దేహంతో ఉన్న కారును రహదారి పక్కన నిలిపి మద్యం సీసాలు కొనుగోలు చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది…
ఆ తరువాత విజయవాడ వైపు గా ప్రయాణించి ఐతవరం గ్రామ శివారులో రహదారి ప్రక్కన కారు ప్రమాదం జరిగింది అనుకునేలా కంధకంలోకి దించి అక్కడ నుండి తిరిగి రాకేశ్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం ఈ సమాచారం ప్రకారం తెలంగాణ పోలీసులు రీ కన్సట్రక్షన్ చేయనున్నారు