హాస్య నటుడు అలీ ప్లేట్ ఫిరాయింపు: వైసిపిలోకి జంప్, ముహూర్తం ఖరారు….ప్రముఖ తెలుగు సినీ నటుడు అలీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన సోమవారం ఉదయం వైసిపిలో చేరనున్నారు. అలీకి వైసీపీ కండువా కప్పి జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. అలీ వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో వరుసగా భేటీ అయ్యారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంపై సందిగ్దం కొనసాగుతూ వచ్చింది. అయితే, ఆయన టీడీపిలో చేరుతారని రెండు మూడు రోజుల క్రితం ప్రచారం జరిగింది. గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి నుంచి టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. చివరకు అలీ వైసిపి గూటికి చేరుతున్నారు. అలీ వైసీపీలో చేరితే ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా అనే ప్రశ్నలకు త్వరలో సమాధానాలు లభించనున్నాయి.
Show less