“సహస్ర చక్రయువ సమైక్య పర్తి యాత్ర” by Sri Sathya Sai Seva Organization in Visakhapatnam,Vizag Vision…వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు పుట్టపర్తిప్రశాంతినిలయం లో 5, 6 తేదీల్లో జరుపుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ శ్రీసత్య సాయి సేవా సంస్థల యువత “సహస్ర చక్ర యువ సమైక్యపర్తి యాత్ర ను 2 ఏప్రిల్ న బి వి కె కాలేజీ, ద్వారకానగర్ నుండితెల్లవారుఝామున 5: 30 గంటలకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలరాష్ట్ర అధ్యక్షులు ఎస్ జి చలం జండా ఊపి ప్రారంభిస్తారు.
ఈ సహస్ర చక్ర యువ సమైక్య పర్తి యాత్ర లో ఆంధ్ర ప్రదేశ్ కుచెందిన 13 జిల్లాల నుండి 500 ద్విచక్ర వాహనాలపై (మోటార్‌సైకిల్స్) 1000 మంది శ్రీ సత్య సాయి యువత 2 ఏప్రిల్ నవిశాఖపట్నం లో లాంఛనంగా ప్రారంభమయి 4 ఏప్రిల్ సాయంత్రంపుట్టపర్తి చేరుకుంటారు.
ఒకొక్క మోటార్ సైకిల్ మీద ఇద్దరు యువకులు భద్రత హెల్మెట్స్ధరించి ప్రయాణిస్తారు. ” హెల్మెట్ ధారణ – మీకు, మీ కుటుంబానికిరక్షణ’ అన్న సందేశం అందరికీ అవగాహన కలిగిస్తూ పరిమిత వేగంతో అతి భద్రతలతో, అత్యంత క్రమశిక్షణ తో వీరు ప్రయాణిస్తారు.
ఈ యాత్ర లో ఉదయం పూట 6 గంటల నుండి 11 వరకు సాయంత్రం పూట 4 నుండి రాత్రి 8 గంటలవరకు ప్రయాణం చేసి విశ్రాంతి తీసుకుంటారు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సహస్ర చక్ర యువసమైక్య పర్తి యాత్ర ప్రారంభించే ముందు యావత్ ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో బీద వారికి, దీనులకు దుప్పట్లు పంచడం, స్వచ్ఛందంగా రక్త దానం చేసి, గ్రామాల్లో గ్రామా సేవ చేసి తద్వారా స్కూళ్ళు, మందిరాలు , శుభ్రపరిచారు. పుట్టపర్తి యాత్ర ముగిసినఅనంతరం యావత్ ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీ సత్య సాయి యువత ఆర్త జనోద్ధరణ సేవ(అంటే జుట్టు పెరిగిపోయి నెలల తరబడిస్నానాలు లేక , మతి స్థిమితం లేక బస్సు స్టాండా దగ్గర, రోడ్ల మీద , రైల్వే స్టేషన్ దగ్గర నివసించే దీనులకు సేవ చేస్తారు(వారికిస్వయంగా జుట్టు కత్తి రించి, వేడి నీళ్లతో షాంపూ తో స్నానంచేయించి , వంటి మీద గాయాలు, కురుపులు మెడిసిన్ స్వయంగారాసి, మంచి బట్టలు, తొడిగి , కడుపారా భోజనం పెట్టి వారిని ఫ్రెష్‌గా తయారు చేస్తారు.