Italy Free-Enrolment Session by Videsh Consultz in Visakhapatnam,Vizag Vision…
ఇటలీలో స్కాలర్షిప్ పై వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉచిత విద్య
– సపీన్జా యూనివర్సిటీ రోమా (ఇటలీ) ప్రొఫెసర్ పాలో టీఓఫీల
ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉచితంగా ఎం ఎస్ ను అభ్యసించేందుకు స్కాలర్షిప్ తో కూడిన విద్యను అందిస్తున్నామని సపీన్జా యూనివర్సిటీ రోమా (ఇటలీ) ప్రొఫెసర్ పాలో టీఓఫీల తెలిపారు. ద్వారకానగర్‌లో గల విదేశ్ కన్సల్టెన్సీ లో యూరప్ దేశాల్లో ఉచిత ఉన్నత విద్య అవకాశాలు గురించి విద్యార్థులు వారి తలిదండ్రులతో ముఖా ముఖి అవగాహనా సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరప్ లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి భారత దేశంనుంచి అనేకమందికి స్కాలర్షిప్ లతో అభ్యసించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. తమ యూనివర్సిటీ అనేక కొత్త విభాగాల్లో కోర్సులు అందిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విదేశ్ కన్సల్టెన్సీ అధినేత జి. ఎస్ ఆర్ చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా గత 10 సంవత్సరాల కాలంలో అనేక వందల మంది విద్యార్థులను ఇటలీ లో గల 48 యూనివెర్సిటీ ల ద్వారా ఉచిత విద్య నభ్యసించి మంచి ఉపాధి అవకాశాలు పొందారన్నారు. చాల మంది అమెరికన్ యూనివర్సిటీలకు పాకులాడుతారని, ఇటలీ వంటి యూరోపియన్ దేశాల్లో ప్రపంచ పేరొందిన యూనివర్సిటీలో నాణ్యమైన విద్యను అభ్యసించడానికి కేవలం రెండు మూడు లక్షలు ప్రారంభంలో ఖర్చు చేస్తే సరిపోతుందని అన్నారు. 94 శాతం తాము వీసా సక్సెస్ రేట్ కలిగివున్నామని, ఇప్పటివరకు 6 వేల మందికి పైగా తమ ద్వారా యూరప్ ప్రధానంగా ఇటలీలో ఉన్నత విద్యను అభ్యసించారని పేర్కొన్నారు. అక్కడి వాతావరణం కూడా భారతీయ విద్యార్థులకు ఎంతగానో సహకరిస్తుందని చెప్పారు. ఈ సెమినార్ కు వివిధ ప్రాంతాలనుంచి దాదాపు 60 మంది విద్యార్థులు హాజరయ్యారు