Anthrax Diseases Rural areas alert Government,Visakhapatnam,VizagVision….విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ వ్యాది మరోసారి కలకలం సృష్టిచింది… ఐదుగురు గిరిజనులపై వ్యాది విజృభించిన నేపద్యంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది…తక్షణమే వైద్య పరంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి గంటా శ్రీనివాస్ రావు అదికారులతో కలసి అంత్రాక్ప్ వ్యాది భాదిత గిరిజనులను పరామర్శించారు…కేజీహెచ్ లో చర్మవ్యాది విభాగంలో ప్రత్యేకించి చికిత్పను అందిస్తున్న విధానంపై మంత్రి గంటా శ్రీనివాస్ రావు ఆరాదీశారు…విశాఖ ఏజెన్సీలో భాగమైన కోడిపుంజువలస గ్రామంలో వ్యాది లక్షణాలు బయట పడ్డాయని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వ్యాది తీవ్రత పెరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నారు…ఈ క్రమంలో నిల్వఉంచి పశుమాంసాన్ని తినడంతో వ్యాది సోకినట్లు ప్రాధమిక అంచనాకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వర్షాకాలంలో గిరిజనులను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు…ముఖ్యంగా కలుషిత నీటి ద్వారా కాస్తా వ్యాది ప్రభావం ఉంటుందని అంచనాకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మౌళిక సదుపాయాల కల్పన విషయంలోనూ శ్రద్ద చూపుతామని మంత్రి గంటా శ్రీనివాస్ రావు వివరించారు…దీనిపై సిఎం చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి సారించారని , ఇటువంటి విపత్కర పరిస్ధితిలో ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు…మరోవైపు వైద్య అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు….