ఫుడ్ రిపబ్లిక్ తన రెండవ స్టోర్ ను కొమ్మాదిలో్ని సినీ వరల్డ్ లో ప్రారంభించింది. ఆర్ ఎక్స్ 100 మూవీ ఫేమ్, సినీ నటి పాయల్ రాజ్ పుత్, విశాఖ ఎంపీ ఎమ్వీవీ సత్యనారాయణ లు ఈ గొప్ప స్టోర్ ను ప్రారంబించారు. సినీ నటి పాయల్ రాజ్ పుట్ రిబ్బన్ కట్ చేసి ఫుడ్ రిపబ్లిక్ ను ప్రారంభించారు. బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అతిధులంతా ఫుడ్ రిపబ్లిక్ లో ఏర్పాటైన వివిద బ్రాండ్ల ఫుడ్ స్టోర్ లను పరిశీలించారు. ఒక్కొక్క స్టోర్ కు సంబంధించిన వివిద రుచులను టేస్ట్ చేసి సందడి చేసారు. అనంతరం సిటీనటి పాయల్ రాజ్ పుట్ మాట్లాడుతూ విశాఖ పట్నం జిల్లాలో తన రెండవ స్టోర్ ను ప్రారంభించిన ఫుడ్ రిపబ్లిక్ నిర్వాహకులను అభినందించారు. ఒకే చోట వివిధ బ్రాండ్లకు సంబంధించిన స్టోర్ లను ఏర్పాటు చేసి, అన్నిరకాల వంటకాలను, ఫుడ్స్ ను అందించడం గొప్ప విషయమన్నారు. సినిమాల తర్వాత తన కెంతో ఇష్టమైన ఫుడ్స్ కు సంబంధించిన స్టోర్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్, ముంబయి తర్వాత మొట్టమొదటిసారిగా ఒక స్టోర్ ను లాంచ్ చేస్తున్నానని సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూూ తన సొంత ప్రాంతం మధురవాడలో ఫుడ్ రిపబ్లిక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తన మిత్రులు ఏర్పాటు చేసిన ఫుడ్ రిపబ్లిక్ రెండవ స్టోర్ ను ప్రారంభించడం ఆనందంగా ఉన్నారు. రకరకాల బ్రాండెడ్ ఫుడ్ స్టోర్లను ఏర్పాటు చేసి స్థానికులకు అందించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఒకే చోట వివిధ బ్రాండ్లకు చెందిన చికెన్ ఐటమ్స్, బేకరీ ఐటెమ్స్, చాక్లెట్స్, బిర్యానీ ఐటెమ్స్ లాంటివి అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
ఒకే చోట 10 రకాల బ్రాండెడ్ ఫుడ్ స్టోర్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత పాపులర్ అయిన ఫుడ్ రిపబ్లిక్ తన రెండవ స్టోర్ ను విశాఖ పట్నానికి ఆనుకొని వున్న కొమ్మాదిలోని సినీ వరల్డ్ లో ప్రారంభింది. 2017 ఆగస్టు నెలలో గాజువాకలో మొదటి ఫుడ్ రిపబ్లిక్ ప్రారంభమైంది. ప్రపంచ స్థాయి సదుపాయాలు, ప్రమాణాలతో అతి తక్కువ ధరలకే డెలీషియస్ ఫుడ్స్ ను అందించడంలో ఫుడ్ రిపబ్లిక్ ఈ రెండేళ్లలో ఎంతో పేరు గాంచింది. ఇక తన రెండవ స్టోర్ ను జాతీయ రహదారి పక్కన మధురవాడకు ఆనుకొని, కొమ్మాదిలో వున్న సినీవరల్డ్ లో మరో ఫుడ్ రిపబ్లిక్ ప్రారంభించింది. ఇడ్లీస్, ది ధిక్ షేక్ ఫేక్టరీ, మెక్సికన్ చికెన్ పాపర్స్, గ్రిల్ సిటీ, చాప్ స్టిక్స్, రాజుగారి రుచులు, క్విక్ బైట్ ఫేక్టరీ, కుర్టోష్, చాక్లెట్ ధియరీ, వంటి బ్రాండ్లతో ఫుడ్ రిపబ్లిక్ స్టోర్ లో అనేక రకాల రుచులు అందిస్తున్నారు. ఫుడ్ రిపబ్లిక్ స్టోర్ లో దాదాపు 250 సీట్ల కెపాసిటీతో అతిపెద్ద స్టోర్ గా అవతరించింది. అలాగే పార్టీలు, ఫంక్షన్ల కోసం 30 మందితో మరో ప్రైవేట్ హాల్ సౌకర్యాన్ని కూడా ఫుడ్ రిపబ్లిక్ అందిస్తోంది. ఎస్టీబీఎల్ సినీ వరల్డ్ కు ఆనుకొని వున్నందున, ఒకే చోట మూవీస్, ఫుడ్, షాపింగ్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఫ్యామిలీతో కలిసి మంచి ఫుడ్ కోసం బయటకు వచ్చే వారి కోసం ఫుడ్ రిపబ్లిక్ అన్ని రకాల రుచులను అందిస్తుందనడంలో సందేహం లేదు. టిఫిన్స్, బిర్యానీస్, ఐస్ క్రీమ్స్, చికెన్ ఐటెమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి రకరకాల రుచులను ఒకే చోట అందించేలా ఫుడ్ రిపబ్లిక్ స్టోర్ ఏర్పాటైంది.