Users are angry at Big Bazaar furniture Visakhapatnam,Vizagvision..విశాఖపట్టణంలోని బిగ్ బజార్ దగ్గర ఉద్రిక్త పరిస్థితితులు చోటు చేసుకున్నాయి. ద్వారాకానగర్ వద్ద ఉన్న బిగ్ బజార్ షాపింగ్ మాల్ పై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ అమలు సందర్భంగా క్లియరెన్స్ సేల్ అంటూ బిగ్ బజార్ ప్రచారం చేసింది. దీంతో వైజాగ్ నలుమూలల నుంచి వినియోగదారులు శుక్రువారం అర్ధరాత్రి భారి సంఖ్యలో షాపింగ్ మాల్ వద్దకు తరలివచ్చారు . ఊహించని స్పందన రావడంతో బారులుతీరిన జనాన్ని బిగ్ బజార్ సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేశారు. వారి వల్ల కాకపోవడంతో ముందు జాగ్రత్తగా షాపింగ్ మాల్ ను మూసేశారు. దీంతోఅసహనానికి గురైన వినియోగదారులు బిగ్ బజార్ పై దాడికి దిగారు. బిగ్ బజార్ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బయట ఉంచిన ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.