రాయలసీమలో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాల కారణంగా కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఇసుక కొరతపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో ఇసుక కొరతపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా వరద ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు.
వరద తగ్గిన వెంటనే ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.
వరదలు తగ్గిన తర్వాత వీలైనంత ఇసుకను స్టాక్ యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు.
అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు.
లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
సెప్టెంబర్ చివరి నాటికి డేటా సేకరణ, పరిశీలన పూర్తి కావాలన్నారు.
అక్టోబర్ చివరి నాటికి ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలని సూచించారు.
నవంబర్ నాటికి భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కావాలన్నారు.
గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు.
డిసెంబర్ నుంచి కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు ఇస్తామని చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్ప్లే ఉండాలని, రేషన్‌కార్డులు, పెన్షన్లు ఉన్నవారి జాబితా బోర్డులో పెట్టాలన్నారు.
ఇళ్ల పట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా ఉండాలని ఆదేశించారు.
వైయస్ఆర్ కంటి వెలుగు పథకం కింద 5.3 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రూ.560 కోట్లతో వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు.