CM YS Jagan Pays Homage To Ex Minister Satya Rao,Visakhapatnam,Vizagvision…
స్వర్గీయ బలిరెడ్డికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
విశాఖపట్నం సెప్టెంబర్ 28: శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం నివాళులు అర్పించారు. ఉదయం గన్నవరం నుండి విమానంలో విశాఖపట్నం చేరుకున్న ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో మహారాణి పేట లో ఉన్న స్వర్గీయ మంత్రి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్. కె. మీనా ఉన్నారు. అంతకుముందు వి ఎం ఆర్ డి ఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాస్, ఆర్ అండ్ బి మంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, పసుపులేటి బాలరాజు, విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణ, తిప్పల నాగిరెడ్డి, ఎ. ప్రదీప్ రాజ్, గొల్ల బాబురావు, dccb చైర్మన్ యు. సుకుమార్ వర్మ సత్యారావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. విశాఖ నగరం, జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విషాద హృదయాలతో వీడ్కోలు పలికారు