“తిప్పురా మీసం” Movie Realease on Nov 8th Movie Unit Press Meet in Visakhapatnam.నగరంలోని డైమండ్ పెరల్ హోటల్లో బుధవారం “తిప్పరా మీసం” చిత్రం యూనిట్ సందడి చేసింది. నవంబర్ 8న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కీ తంబోలి , ప్రొడ్యూసర్ రిజ్వాన్ నగరానికి వచ్చారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన చిత్ర బృందం.. డైమండ్ పార్క్ హోటల్లో సందడి చేసింది. శ్రీ ఓం సినిమాస్ పతాకంపై కృష్ణ విజయ్ దర్శకత్వంలో నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రం తిప్పరా మీసం చిత్రం 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయవాడ నుంచి ప్రమోషన్ ప్రారంభించారు. డైమండ్ పెరల్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో విష్ణు మాట్లాడుతూ గత చిత్రాలకంటే రొటీన్ కు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. అన్ని వర్గాల వారినీ సినిమా అలరిస్తుందని, ముఖ్యంగా యూత్ ను అట్రాక్ట్ చేస్తుందన్నారు. తన స్వస్థలమైన విశాఖపట్నంలో చిత్ర ప్రచారం కోసం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హీరోయిన్ నిక్కీ తంబోలి మాట్లాడుతూ.. తిప్పరా మీసం మూవీ తెలుగులో తన మొదటి సినిమా అని, మంచి గుర్తింపు ఇచ్చే పాత్రలో నటించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల వారినీ సినిమా అలరిస్తుందని, ఈ చిత్రం విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో హీరో హీరోయిన్ లతో పాటు, ప్రొడ్యూసర్ రిజ్వాన్, చిత్ర బృందం పాల్గొన్నారు.