Given Clarity On AP Special Status Issue by MP Vijayasai Reddy in Visakhapatnam
అవినీతిరహిత పాలనే ఈ ప్రభుత్వం లక్ష్యం- విజయ సాయి రెడ్డి
మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి కైలాసపురం డి ఎల్ బి గ్రౌండ్ లో ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పధకాలకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి , రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ శంకు స్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అభివృద్ధి పధంలో పయనిస్తోంది , ఆయన పై నమ్మకం తో రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యే లను అందించిన రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మన ముఖ్యమంత్రి అందరికీ భరోసా కల్పిస్తున్నారని , గత ప్రభుత్వంలో చంద్రబాబు అవినీతికి అంతు లేకుండా పోయిందని అందుకే వారి ఎమ్ పి లను కూడా బి జె పి లో కలిపి పరోక్షంగా వారికి సహకరించి ఈయన తప్పును కప్పిపుచ్చుకుoటున్నారని, చంద్రబాబు ఒకప్పటి జాతీయ నాయకుడు కానీ ఇప్పుడు ఒక జాతికి చెందిన నాయకుడిగా మిగిలి పోయాడని విమర్శించారు., ఈ ప్రభుత్వం లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతికి ఆస్కారం లేకుండా పాలిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, శాసన సభ్యులు గుడివాడ అమరనాధ్, జి వి ఎం సి కమీషనర్ సృజన , అధికారులు, వై కా పా నాయకులు చొక్కాకుల వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు