విశాఖలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాలు దర్నాకు దిగాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమించి విధుల్లోకి చేరేందుకు వచ్చిన వారిని నిలువరించడంపై సీఐటీయూ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ డిపోలకు వెళ్తున్న కార్మికుల అక్రమ అరెస్ట్ లను తొలగించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు.గత 53 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ .. కార్మికుల విషయంలో వ్యతిరేక విధానాలను అవలంభిస్తారని మండిపడ్డారు. వెంటనే కార్మికుల విధుల్లోకి తీసుకోవాలని కోరారు.