ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు in Visakhapatnam..
ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు విశాఖ జిల్లా పార్లమెంట్ యస్.సి సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డా” శ్రీ బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు రాసిన ఈ భారత రాజ్యాంగం వలన అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని అదే రాజ్యాంగ విలువలను పాటిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ న్యాయం జరిగేలా పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అందరి మన్ననలు చురగొంతున్నారని కొనియాడారు. ప్రతిపక్షాలు అనవసరమయిన రాద్దాంతం చేసి ఈ పధకాలను అడ్డుకోవడం మాని సహకరిస్తే ప్రజలకు మరింత న్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రేయ్యి వెంకటరమణ,మాజీ కొర్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల అధ్యధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు