Kothapally Waterfalls at Vizag Tourists Visit Place at G. Madugula in Visakhapatnam
పర్యాటకులతో ‘కొత్తపల్లి’
ప్రకృతి అందాలకు పుట్టినిల్లు విశాఖ మన్యం అంటే అతిశయోక్తికాదు. ఎత్తయిన పర్వతాలు, కొండలు, పెద్దపెద్దలోయలు, గలగలా పారే సెలయేళ్లు, ఎటుచూసినా పచ్చని తోటలతో ఆహ్లాదపరిచే వాతావరణం ఈ ప్రాంత సొంతం. ఇందులో విశాఖ మన్యంలో జి.మాడుగుల–చింతపల్లి రోడ్డులో కొత్తపల్లి జలపాతం అందరినీ ఆకర్షిస్తోంది. ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా నుంచి తరలి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు. జలకాలాదుతూ ఆనందంగా గడిపారు.