ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడి నేటికి 6 నెలలు పూర్తయింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ పని తీరుపై వరుస ట్వీట్లు చేశారు మోదీ.
గడిచిన 6 నెలల్లో దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గడిచిన 6 నెలల కాలంలో దేశాభివృద్ధి, సామాజిక సాధికారత, ఐక్యత దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
మోదీ 2.0 ప్రభుత్వం ఏర్పడి నేటికి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు ప్రధాని.
మోదీ ట్వీట్
‘సబ్కాసాథ్.. సబ్కా వికాస్’ నినాదం స్ఫూర్తితో 130 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదం తమకు ఉందన్నారు మోదీ.
ప్రజల మద్దతుతో ఎన్డీఏ సర్కారు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు.
130 కోట్ల మంది ప్రజల జీవితాలలో నూతన శక్తిని నింపి శక్తిమంతం చేసేలా పనిచేస్తున్నామన్నారు.
భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామన్నారు మోదీ.
ఫలితంగా సుసంపన్నమైన, ప్రగతిశీల భారతదేశాన్ని నిర్మించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.