Visakha Rasikonda Beach Tragedy Two Death.Visakhapatnam,Vizagvision…విశాఖ తీరంలో కడలి కెరటాలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి…ఈ రోజు ఉదయం ఋషి కొండ తీరంలో స్నానానికి వెళ్ళిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు….వీరిలో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు…వీరందరు నగరంలోని మురళీ నగర్ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు…చనిపోయిన ఇద్దరినీ రాహుల్, నావల్ గా గుర్తించారు…ఇక మిగిలిన వాళ్ళంతా సురక్షితం గానే ఉన్నారు….ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో వీరంతా ఋషికొండ తీరంలో స్నానానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది…ముఖ్యంగా బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అల్లలు తీవ్రత మరింతగా పెరిగాయి…ఈ నేపద్యంలోనే వీళ్ళంతా ఈతకు వెళ్ళిన సంధర్భంలో భారీ కెరటం వీళ్ళను లోపలకు తీసుకెళ్లినట్టుగా స్థానికులు చెబుతున్నారు…అయితే మరోవైపు లైఫ్ గార్డ్ లు వాళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళిద్దరూ అప్పటికే ప్రాణాన్ని కోల్పోయారు….