VIZAGVISION: Vizag Police Held Naka Bandi.Visakhapatnam…విశాఖ నగరంలో పోలీసులు నాకా బంది నిర్వహించారు. టూ వీలర్ దొంగతనాలు చెయిన్ స్నాచింగ్ లను దృష్టిలో ఉంచుకుని పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గత ఏడాది శ్రావణ శుక్రవారం ఒక్కరోజే నగరంలో అత్యధికంగా చెయిన్ స్నాచింగ్ లు జరిగాయి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పోలీసులు నాకా బంది నిర్వహించారు. లైసెన్స్ లు లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వారు, సరైన సర్టిఫికెట్లు లేకుండా బండి నడిపేవారు, స్పీడ్ డ్రైవింగ్, సిగ్నల్ జెంపింగ్, వంటి అంశాలను పోలీసులు పరిశీలించారు. పలువురిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. నగరమంతా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో ఏం జరుగుతుందోనని నగరవాసులు ఒకింత ఆందోళన చెందారు. ఐతే నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ప్రజల శ్రేయస్సు కోసమే నాకా బందీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.