VIZAGVISION:VPT & VCTPL Containers Cargo to Nepal by Rail flagged Visakhapatnam…విశాఖ కంటైనర్ టెర్మినల్ నుంచి నేపాల్ కు రైలు మార్గంలో పూర్తి స్ధాయిలో 90 ర్యాక్ ల ద్వారా కంటైనర్లను విశాఖ పోర్టు అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.ఇప్పటి వరకూ కోల్ కతా పోర్టు నుంచి నేపాల్ తనకు అవసరమైన వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. కోల్ కతా పోర్టు రద్దీగా మారడం తో మరో పోర్టు వైపు నేపాల్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా విశాఖను కేంద్ర ప్రభుత్వం సూచించింది.ఈ నేపధ్యంలో రెండు మార్లు విశాఖ లో పర్యటించిన నేపాల్ బృందం ఇక్కడి నుంచి పూర్తి స్ధాయిలో తమకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకుని రైలు మార్గం ద్వారా నేపాల్ కు తరలించాలని నిర్ణయించింది.అందులో భాగంగా 90 కంటైనర్లను రైలు మార్గం ద్వారా పోర్టు అధికారులు నేపాల్ కు పంపించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ రెడ్డి అందిస్తారు…