Fishing Harbour Boat Crashes | ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిన బోటు ప్రమాదానికి గురైంది | Visakhapatnam | Vizagvision..విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిన బోటు ప్రమాదానికి గురైంది.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి చెందిన బోటు యజమాని నరసింహమూర్తి నాలుగు రోజుల క్రితం చేపల వేటకు బయలు దేరింది. ఎనిమిది మంది తో బయలుదేరి బోటు నాలుగు రోజులు వే ట చేసి తిరిగి వస్తుండగా బుధవారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరానికి 50 కిలోమీటర్ల దూరంలో యాంకర్ వేసి అందరూ నిద్ర లోకి జారుకున్నారు. సముద్రంలో ఈదురు గాలుల కారణంగా యాంకర్ తెగిపోయి బోటు అన్నవరం సాగర తీరానికి కొట్టుకొచ్చింది. మేల్కొన్న కళాసిలు చూసేసరికి సాగర తీరం ఒడ్డున ఒక వైపు ఉంది ఉంది. దీంతో వారంతా బోటు నుంచి దూకి ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న బోటు యజమాని నరసింహమూర్తి సంఘటన స్థలానికి చేరుకొని 3 ట్రాక్టర్లు. ఒక క్రేన్. 30 మంది సహాయంతో బోటు ను బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. బోటు రెండుగా చీలిపోయి సముద్రగర్భంలో కలిసి పోయింది 40 లక్షల వరకు అస్తు నష్టం జరిగిందని ఆవేదన చెందారు .ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.