Fishing Harbour Boat Fired | హార్బర్లో ఓ బోటు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది | Visakhapatnam | Vizagvision..
విశాఖలో మరో ప్రమాదం…తప్పిన పెను ముప్పు
నగరంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే మంటలను గుర్తించిన మత్స్యకారులు పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు కిందకు దూకి ఒడ్డు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూ.50 లక్షలు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలిసింది. హార్బర్లో ఓ బోటు ఇవాళ చేపల వేటకు వెళ్లింది. చేపల వేట తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?. ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై సమాచారం తెలియాల్సి ఉంది.