Under Path Way Bridge Has Become Available at Old Gopalapatnam in Visakhapatnam,Vizagvision..ఎంతోకాలంగా ఎదురు చూసిన అండర్ పాత్ వే అందుబాటులోకి వచ్చింది. పాత గోపాలపట్నం పరిసర ప్రాంతవాసుల చిరకాల వాంఛ నెరవేరింది. నూతనంగా నిర్మించిన అండర్ పాత్ వే బ్రిడ్జిను విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ ప్రారంభించారు. పశ్చిమ ఇంచార్జ్ మళ్ల విజయ ప్రసాద్,విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కరరావు, స్థానిక గ్రామ సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వైకాపా శ్రేణులు, స్థానికులు పాత గోపాలపట్నం అండర్ పాత్ వే వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంపీ ఎంవీవీ అండర్ బ్రిడ్జి మార్గాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. పాత గోపాలపట్నంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన లేకపోవడంతో గతం లో జనం తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురయ్యేవారు.తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగ ఉత్పన్నమయ్యేవి. ట్రాక్ అవతల ఉండే ప్రాంత ప్రజల రాకపోకలకు ఇక్కట్లు ఎదుర్కొనేవారు.బ్రిడ్జి రాకపోకల మార్గం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎట్టకేలకు ఈ ప్రాంతవాసుల కల ఇన్నేళ్లకు నెరవేరింది. 5 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి 15 అడుగుల వెడల్పు,60 అడుగుల ఎత్తుతో అండర్ పాత్ వే బ్రిడ్జిని నిర్మించారు. సుమారు 45 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రజావసరాలు,సమస్యలు గుర్తించి పరిష్కరించడమే జగన్ సర్కార్ లక్ష్యమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్,ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రత్యేక చొరవ చూపారని, కేంద్ర మంత్రులు, రైల్వే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించామన్నారు.తన హయాంలో ఈ వంతెనను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రజావసరాలకనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ వైకాపా ఇంచార్జ్ మళ్ల విజయ ప్రసాద్ ఆన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడే ప్రయత్నాలు జరిగాయని, అండర్ పాత్ వే ఇన్నాళ్లకు ప్రజలకు అందుబాటులోకి సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సేవాసంఘం అధ్యక్షుడు బి.ఎన్.రాజు,పసుపురెడ్డి రమణ, వేణమ్మ,వైకాపా నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.