Govt Negligence Emergency Road Facility Built 5kms Road by Trible Familys in Vijayanagaram,Vizagvision…
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మెం బలికాము అని తమ అత్యవసర సదుపాయం రహదారిని నిర్మించుకున్న ..విజయనగరం జిల్లా గిరిజనులు
మొన్న విశాఖపట్నం జిల్లామన్యం నిన్న విజయనగరం మన్యం.. ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారవు అని.ఓటు కోసం వచ్చే నాయకులు. మా అవసరాలకు పనికిరారు అని..గిరిజనచైతన్యం..అంటే చూపడానికి 125 కుటుంబాలు ఇంటికి 7000 రూపాయలు చందాలు ఎత్తుకొని చాలకపోతే కొంత అప్పు తెచ్చుకొని సుమారు 20లక్షల రూపాయలతో రోడ్డు వేసుకున్న కోదమ గ్రామపంచాయతీ సాలూరు మండలం ఒరిస్సా సరిహద్దు గ్రామ గిరిజనులు
సుమారు#5 కిలోమీటర్ల మేర రోడ్డును ఒరిస్సాబారి జంక్షన్ కు వేసుకున్నారు..
ఇలా చందాలతో వారి సమస్యలను వారే సమాధాన పరుచుకొంటే మరి గిరిజన సంక్షేమ శాఖ నిధులు ఏమవుతున్నాయి..ఎవరి గల్లా పెట్టె నింపుతున్నాయి……
గిరిజనులను కేవలం ఓట్ బ్యాంక్ లా చూసే రాజకీయ ఉచ్చులో ఇంకెన్నేళ్ళు గిరిజనులు మగ్గాలి….
గత ప్రభుత్వాలు కేవలం వాగ్దానాలకు పరిమితము అయ్యాయి..కానీస0 కొత్త ప్రభుత్వం అయిన వారి అవసరాలకు అండగా నిలవాలి ..ఏదైతే వారు చందాలు ఎత్తుకొని రహదారి నిర్మాణం చేపట్టారో కనీసం ఆ సొమ్మును ఉపాధి హామీ పథకం ద్వారానైనా తిరిగి వారికి చెల్లించాలి..ఇలాంటి గ్రామాలకు డోలి సమస్య రహదారి సమస్య మంచినీటి సమస్యలపై దృష్టి సారించాలి