భారీ పంట నష్టం తో బోరుమన్న ఆదివాసీ రైతులు గోడు పట్టని పాలకులు రైతుల గోడు పట్టని పాలకులు Visakhapatnam,Vizagvision…
భారీ పంట నష్టం తో బోరుమన్న ఆదివాసీ రైతులు.ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం పోయిపల్లి పంచాయతీకి చెందిన గజోం వీధి గ్రామస్తులు తొమ్మిది కుటుంబాలకు చెందిన రైతుల పంట పొలాలు నీట మునిగిందని
ఇది తెలుసుకున్న గిరిజన సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు, గిరిజన సంఘం నాయకులు జంపగి సునీల్, కూడా వంశీ
గజోంగి వీధి గ్రామానికి వెళ్లి బాధిత రైతుల ఆవేదన అడిగి తెలుసుకున్నారని
గిరిజన సంఘం నాయకులతో రైతులు మాట్లాడుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారని . గత 4 నెలల క్రితం సుమారు మూడు లక్షల 80 వేల రూపాయలు మా స్వంత నిధులు వెచ్చించి కల్వర్టు చేసుకున్నామని అయినప్పటికీ భారీ వర్ష ప్రభావం వల్ల కల్వర్టు కొట్టేసిందని దీని కారణంగా చెమటోడ్చి కష్టపడిన పంట పొలాలు నీట మునిగి మాకు కన్నీరు మిగిలిందని
ప్రతి ఏడాది ఇలాగే వరదలకు మా పంట పొలాలన్నీ నీట మునిగి మా శ్రమకు ఫలితంగా పిడికెడు ధాన్యం ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ వర్షానికి దెబ్బతిన్న పొలాలు తీర్మానం చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని
అయినప్పటికీ ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు గానీ అధికారులు గాని ఎవరు పట్టించుకోకపోవడం చాలా బాధ కలిగిస్తుందని అంటూ గిరిజన సంఘం ద్వారా అయినా మా సమస్యలను చెప్పుకో గలిగే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నామని ఇంత జరిగిన ప్రస్తుతం ఉన్న వాలంటీర్లు గాని సచివాలయ సిబ్బంది గాని పంచాయతీ కార్యదర్శి అలాగే
వి ఆర్ వో ఎవరు ఈ సమస్యపై అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా తాతలు ముత్తాతలు ఎదుర్కొన్న సమస్యలే ఇప్పటిదాకా మేము ఎదుర్కొంటున్నామని ప్రభుత్వాలు మారినా మా సమస్యలు పరిష్కారం అవటం లేదని ప్రభుత్వం తలచుకుంటే కల్వర్టు నిర్మాణం చేసి ఇవ్వటం పెద్ద సమస్య కాదని అయినా ఈ ప్రభుత్వాలు మమ్మల్ని మనుషులు లా గుర్తించే పరిస్థితి లేదని
ఐదేళ్లకు ఒకసారి ఓట్లు ఎలక్షన్ వచ్చినప్పుడే మేము గుర్తుకు వస్తాము తప్ప
మేము చచ్చినా బతికినా
ఈ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాలు మా మా బాధలు పట్టించుకునే పరిస్థితులు లేకపోవడం తీవ్ర ఆవేదనను కలిగిస్తుందని వాపోయారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ మాట్లాడుతూ…
ప్రతి ఏడాది వర్షాకాలంలో పెదబయలు మండలమే కాకుండా ఏజెన్సీ అన్ని మండలాల్లో కొన్ని వేల ఎకరాలు నీట ములుగు తున్న ప్రభుత్వం మాత్రం తమకు పట్టనట్టు వ్యవహరిస్తుందని రైతుల కోసమే పుట్టాం మేము బతికున్నంత కాలం రైతులను ఉధరించడమే మా లక్ష్యం అంటూ ఓట్లు దండుకుని ప్రజాప్రతినిధులు
గా గద్దెనెక్కిన తరువాత ప్రజల కష్టాలు మరిచిపోయి పర్సెంటేజ్ ల కోసం పాకులాడుతున్నారని ఇటువంటి ప్రజాప్రతినిధులను దేహ శుద్ధి చేయవలసిన అవసరం ప్రజలకు ఉందని గజోంగి వీధి గ్రామానికి చెందిన 9 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి పంట నష్టం కింద 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు
అలాగే భవిష్యత్తులో వరదల కారణంగా పంటలు నష్టపోకుండా నిధులు కేటాయించి కల్వర్టు నిర్మించి రైతు కన్నీరు తుడా వాలని వర్ష ప్రభావం వల్ల దెబ్బతింటున్న వందలాది ఎకరాల పంటపొలాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పంట నష్టం చెందిన రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకో కపోతే భవిష్యత్తులో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.