గుండెపోటు తో ‘హాత్వే రాజశేఖర్ కన్నుమూత in Hyderabad,Vizagvision…
విశాఖపట్నం, న్యూస్ లీడర్, ఆగస్టు 29 : కేబుల్ టీవీ రంగంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన ‘హాత్వే’ రాజశేఖర్ హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయిన రాజశేఖర్ శనివారం తెల్లారి నిద్రలోనే కన్ను మూసినట్లు బంధువులు తెలిపారు. రాజశేఖర్ గతంలో ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ కేబుల్ రంగాలను శాసించారు.
రాష్ట్రంలో పది లక్షల కేబుల్ కనెక్షన్లు కలిగిన ఏకైక వ్యక్తి రాజశేఖర్ ప్రసిద్ధి చెందారు. గత ఏడాది ఆర్థిక అవసరాల కోసం తన కేబుల్ నెట్వర్క్ ను గుజరాత్ టీవీ లింక్స్ (ఎ) లిమిటెడ్ కు అమ్మేశారు. అయితే ఈ సంస్థలో లావాదేవీలు పూర్తి కాకపోవడంతో ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. అయితే రానురాను రాజశేఖర్ ప్రతిభ సన్నగిల్లింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని కేబుల్ రంగంలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన రాజశేఖర్ ఇటీవల కాలంలో వెనుకబడ్డారు. తను పిలిస్తే మీడియా సంస్థ అధినేతలే కాకుండా
అధికారంలో ఉన్న రాజకీయ ప్రముఖులు కూడా క్షణాల్లో వచ్చి వాలేవారు. మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన బొబ్బిలి దగ్గరి సీతానగరం తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజశేఖర్ మరణం పట్ల కేబుల్ రంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి