దేవస్థానం భూముల్లో విలేకరి గా చలామణి అవుతున్న ఓ వ్యక్తి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు in Simachalam,,Visakhapatnam,Vizagvision…
ఆరిలోవ pedagadili ఏరియాలో సింహాచల దేవస్థానం భూముల్లో విలేకరి గా చలామణి అవుతున్న ఓ వ్యక్తి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు పి. గజలక్ష్మి, దువ్వి తాతారావు, వమ్మి చిన్నారావులు ఆరోపించారు. VJF ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పేదవారు నిర్మించుకున్న నిర్మాణాలు నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్న అధికారులు ఇటువంటి అక్రమ నిర్మాణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. విలేఖరి నంటూ ఇల్లు నిర్మాణం చేసుకునే వారిని బెదిరిస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అతనిపై పోలీసులు ఇతర ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.