అందరికీ అందుబాటులో ఉన్నత విద్య – గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరి చందన్. ‘ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం 2020 పాత్ర’ పై జరిగిన గవర్నర్ల సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ హరి చందన్. నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి కమిటీ ఏర్పాటు చేసామని చెప్పిన గవర్నర్. నూతన జాతీయ విద్యా విధానాన్ని సంపూర్ణంగా రాష్ట్రంలో అమలు చేస్తామని గవర్నర్ శ్రీ హరి చందన్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, కేంద్ర విద్యా మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్ర విద్యా మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ సమావేశంలో పాల్గొన్నారు.