Focus on Setting Up CCTV Cameras in Temples & Residences Press Meet DCP in Visakhapatnam,Vizagvision..
సీసీ కెమెరాల ఎర్పాటుపై దృష్టి సారించండి విశాఖ మహా నగరంలో ఉన్న చిన్న,పెద్ద దేవాలయాల్లోని,చర్చ్ ల్లోని,మస్జీద్ ల్లోని సీసీ కెమెరాలు,ప్రైవేట్ భద్రత సిబ్బందిని నియమించుకోవాలని,నగర డీసీపీ-1 ఐశ్వర్య రాస్తోగి ఆలయ సిబ్బంది కి,ఆలయ కమిటీ పెద్దలకు కోరారు.
ఇటివలే ఎంవీపి కాలనీలో గల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలోముగ్గురు వ్యక్తులు అందులో ఇద్దరు జువైనల్స్ చోరీకి పాల్పడతుండగా ఆలయ భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండడం చేత వారు పరారైయ్యారని,డీసీపీ గుర్తు చేసారు .
సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం దొంగ తనాలకు పాల్పడుతున్న నిందితులు ఇళ్ళల్లోనే కాకుండా ఇప్పుడు దేవాలయాలు, చర్చ్ , మస్జిద్ లలో చోరీలకుపాల్పడుతున్నారని అన్నారు.
దింతో ఆలయంలో ఉన్న ఆలయ సొత్తు,బంగారం,హుండీలో ఉన్న నగదు,ఇతరత్రా సొత్తు అపహరణకు గురికాకుండా ప్రైవేటు భద్రత సిబ్బందిని ఏరాటు చేసుకోవాలని ఈ సందర్భంగా డీసీపీ రాస్తోగి కోరారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో రాత్రి రెండు గంటల సమయంలో ఇద్దరు (జువైనల్స్) బాలురు,ఒక వ్యక్తి ఈ ఆలయంలోకి వచ్చి చోరీ కి పాల్పడే సమయంలో సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తంగా వ్యవహరించడంతో చోరీ విఫలమైందని, డిసిపి ఐశ్వర్య రాస్తోగి పెర్కొన్నారు .
నేరాలకు చెక్ పెట్టాలంటే ప్రజలు పోలీసు లకు సహకరిస్తూ సీసీ కెమెరాలు,ఏర్పాటు చేసుకోవాలని,భద్రతా సిబ్బందిని నియమించాలని
కోరారు.