Victims Demand for Poison Move or Control Coromandel in Visakhapatnam,Vizag Vision
మరో ఎల్జీ పాలిమెర్స్ ఘటన ఉత్త్పన్నం కాకముందే కోరమండల్ సంస్థపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు చేపట్టాలని పారిశ్రామిక ప్రాంత కుంచుమాంబ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
సోమవారం సాయంత్రం కోరమండల్ కర్మాగారం నుండి వెలువడిన విషవాయువు కారణంగా ఇబ్బందులు పడి పిలకవాని పాలెం,కుంచుమాంబ కాలనీ వాసులు అస్వస్థకు గురైన
జిల్లా అధికార యంత్రాంగం, కోరమండల్ ఇంటర్నెషనల్ సంస్థ పట్టించుకోవడంలో మీనా మేషాలు లెక్కిస్తుందని కుంచుమాంబ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఈ మేరకు స్థానిక టీడీపీ నేత కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలసి కాలనీ వద్ద ఆందోళన చేపట్టారు తక్షణమే కోరమండల్ ఎరువుల కర్మాగారాన్ని జనవాసల మధ్యనుండి తరలించాలంటు నినాదాలు చేశారు.సుమారు వెయ్యేయికి పైగా ప్రజలు నివసిస్తున్న తమ గ్రామంలో కోరమండల్ సంస్థ కాలుష్య కారణంగా చిన్నారుల నుండి పెద్దవారు వరకు వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ వైపు భారీ వర్షం కారణంగా ఇళ్లల్లో ఉన్నటువంటి వారు నిన్న సాయంత్రం కోరమండల్ నుండి వెలువడిన విష వాయువు కారణంగా ఆనారోగ్యం పాలయ్యారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు చొరవచూపి కోరమండల్ సంస్థపై చర్యలు తీసుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.