విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వసుపల్లి గణేశ్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పాత నగరాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఈ క్రింది పనులను మంజూరు చేయాలని వినాయపూర్వకంగా కోరడ మైనది.
(1) అంగటిదిబ్బ భూ సమస్య అర్హులకు పట్టాల మంజూరు నిమిత్తం – ముస్లింల స్మశాన వాటిక కొరకు వక్ఫ్ బోర్డ్ కు 10 ఎకరాల భూమి ని మధురవాడ లో కేటాయింపు కొరకు
(2) 100 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ కొరకు డీపీర్ సమర్పించారు
(3) 50 కోట్లతో ఇందిరా ప్రియ దర్శిని మునిసిపల్ స్టేడియం పునరుద్ధరణ కొరకు డీపీర్ సమర్పించారు
(4) 10 కోట్లతో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి ఆలయం అభివృద్ధి భాగంగా ఆలయాన్ని ఆనుకొని 1ఎకరా భూమి & గోశాల నిమిత్తం సింహాచలం దేవస్థానం నుండి *5ఎకరాల భూమికేటాయింపు కొరకు
(5) 7 కోట్లతో 7 దేవాలయాలు పోర్ట్ వెంకటేశ్వర స్వామి, ఇసుక కొండ, జగన్నాధ స్వామి, విగ్నేశ్వర స్వామి, ఎరుకుమాంబ, ఓల్డ్ టౌన్ శివాలయం, కురుపాం మార్కెట్ & 3 సత్రాలు అభివృద్ధి కార్యక్రమాలు
(6) హాకర్స్ జోన్ నిమిత్తం 20 కోట్లతో స్టేడియం ఎదురుగా ఉన్న జనతా బజార్ పునరుద్ధరణ
(7) 10కోట్లతో క్వీన్ మేరీ హై స్కూల్ ఆధునికీకరణ
(8) ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానానికి 2ఎకరాల భూమి
కేటాయింపు కొరకు.
(9) 100కోట్లతో 60అడుగుల రోడ్డు వెడల్పు జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కొరకు తగినంత సమయాన్ని కేటాయించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసారు. మరియు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మెయిల్ ద్వారా పంపించమని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ ని ముందుకు తీసుకొని వెళ్లాలని కోరారు.