“దీప యజ్ఞం”బాణసంచాను విడనాడదాం పర్యావరణాన్ని కాపాడుదాం Pranic Healing Centre Awareness at YMCA Beach in visakhapatnam vizagvision శుభాశుభ సందర్భాలన్నింటిలోనూ, బాణాసంచాను బహిష్కరింటం ద్వారా, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల సద్వినియోగం, జంతుప్రేమ లేదా జీవకారుణ్యం అనే సందేశాలను ప్రచారంలోకి, ఆపై ఆచరణలోకి తీసుకువచ్చి తద్వారా భావి తరాలను కూడా చైతన్యవంతులను చేయాలనే సత్సంకల్పంతో మేము (ప్రాణిక్ హీలింగ్ సెంటర్ – విశాఖ) “దీపయజ్ఞం” అనే ఉద్యమాన్ని ప్రారంభిస్తూ, బాణాసంచా విస్తృతంగా వినియోగించే సందర్భం అయినందున ఈ దీపావళి పండుగను పురష్కరించచుకొని శ్రీకారము చుడుతున్నాము. ఈ బృహత్కార్యానికి నాందిగా రేపు 12 వ తేదీ సాయంకాలం గం॥ 5.30 ని॥,కు విశాఖ సముద్రతీరంలో, YMCA ఎదురుగా ఆకాశ దీపాలను వదిలే కార్యక్రమం చేపట్టాము.
జంతు ప్రేమికులూ, పర్యావరణ ప్రేమికులు, సమ భావం కలవారందరూ మాతో సహకరించి, మా కార్యక్రమంలో పాల్గోని, మా ఈ చిన్ని ప్రయత్నాన్ని విజయవంతం చేయవలసిందిగా మా వినమ్ర విజ్ఞప్తి.