Cytoreductive Surgery with HIPEC Treatement Sucessfully done by HCG Cancer Center Arilova in Visakhapatnam,Vizagvision..ఆరిలోవ హెల్త్ సిటీ హెచ్ సి జీ క్యాన్సర్ సెంటర్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేసి పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళకు పునర్జన్మనిచ్చారు. ఈ సందర్బంగా ఆరిలోవ హెచ్ సి జి క్యాన్సర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ దారా, డాక్టర్ భాస్కర్ భువన్ పాల్గొని మాట్లాడారు.గాజువాక కి చెందిన మౌనిక గైనిక్ సంబంధిత క్యాన్సర్ తో బాధపడ్డారన్నారు. అనేక హాస్పిటల్స్ లో చికిత్స పొందినప్పటికీ ఫలితం రాక పోవడంతో హెచ్ సి జి కి వచ్చారని చెప్పారు.రోగి పరిస్థితి విషమం గా ఉండడంతో వినూత్న రీతిలో సైటోరిడక్షన్ సర్జరీ విత్ హై పెక్ ద్వారా ఆపరేషన్ చేసి ఆమెను కాపాడగలిగామన్నారు.ఫోర్త్ స్టేజ్ లో ఉన్న ఆమెను మళ్ళీ సాధారణ స్థాయికి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.మౌనిక మాట్లాడుతూ ప్రాణాల పై ఆశలు వదులుకున్న తనకు హెచ్. సి. జి వైద్యులు పునర్జన్మనిచ్చారన్నారు. ఎన్ని హాస్పటల్స్ కి వెళ్లిన ప్రాణానికి భరోసా లేదన్నారని చివరకు హెచ్ సి జి క్యాన్సర్ హాస్పిటల్ వారె బ్రతికించారని ధన్యవాదాలు తెలిపారు.సమావేశం లో హాస్పిటల్ సి ఓ ఓ డాక్టర్ ఆదిత్యా కౌరా, అశోక్ పట్నాయక్, డాక్టర్ సునీల్ మనోహర్, డాక్టర్ నరేంద్ర ప్రకాష్ పాల్గొన్నారు