Hundreds of Guests Come to that House Every Day | Parrots | Chirping Sparrows| Pigeons | Visakhapatnam | Vizagvision…
ఆ ఇంటికి రోజూ వందల సంఖ్యలో అతిధులు వస్తారు. ఒకరోజు రెండు రోజులు కాదు నిత్యం వచ్చి కడుపునిండా తింటారు. ఇలా తింటుంటే ఆ యాజమానికి కడుపు నిండుతుంది. ఇలా పదేహేను ఏళ్ళగా జరుగుతుంది. ఇంతకి ఎవరా అతిధులు, ఎందుకు అతనింటికే వస్తున్నారు తెలియాలంటే ఈ స్టోరి చూడాల్సిందే..
చీకటిని చీల్చుకుంటూ, బానుడు లేలేత కిరణాలు తాకుతుంటే, పక్షులు కిలకిలరావాలు మేల్ కొల్పుతుంటే ఆ అనుభూతే వేరు.
గిరిజనులకు, పల్లె ప్రాంత ప్రజలకె సొంతం అనుకుంటున్న పక్షులు కిలాకిలారావాలు పట్టణవాసిని పలకరిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో రామచిలుకలు, పావురాలు ఆ కుటుంబీలకును ముచ్చతిస్తున్నాయి. ఇంటి యజిమాని ఆహార వేళలు తప్పితాయామో గాని ఆ మూగ జీవాలకు అందించే ఆహార గింజల విషయంలో కణమైనా ఆలస్యం చేయడం లేదు. ఇరవై సంవత్సరాల క్రితం వరకు లక్ష్మీనారాయణ రెడ్డి కుటుంబ సభ్యలు నలుగురే..కాని ఇ పక్షులతో అనుబంధం ఏర్పాడ్డాక వాటిని ఇంటి సభ్యలుగానే చూసేంతగా అల్లుకుపోయాయి. పదేహేను సంవత్సరాలుగా ఉదయం,మద్యాహ్నం,సాయంత్రం క్రమం తప్పకుండా లక్ష్మీనారాయణ రెడ్డి ఆహారం అందిస్తున్నారు.చూడచక్కని చిలుకలు, కిచకిచమంటూ శబ్ధాలు చేసే పిచ్చికలు, పావురాలు ఇలా రకరకాల పక్షులును చూడాలంటే ఏ జంతుప్రదర్శశాలకే వెళ్ళవాల్సిందే. ఆ కుటుంబం మాత్రం పక్షులు అతీధ్యం ఇస్తూ అందులోనే ఆనందాన్ని ఆశ్వాదిస్తున్నారు. ఇది కేవలం ఈ ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టిపక్కల వారికి వీటి పలకరింపు లేనిదే సూర్యోదయం కాదు. పరిసరప్రాంత వాసులకు పక్షుల రాకపోకలే గడియలు గుర్తుచేస్తుంటాయి. వందలాడి పక్షులు పచ్చనితివాచి పరిచినట్టు మేడమీద కనిపిస్తుంటే ఇరుగుపొరుగువారు ముచ్చటి పడని రోజంటు లేదు. ఎవ్వరికి మనస్సు కాస్త చికాకుగా అనిపించినా , ఒక్కసారి వాటిని వీక్షించాక సాధకబాధలన్నిముటుమాయం అయిపోతాయని స్థానికులు అంటున్నారు. రామచిలుకలు, పావురాలతో 15 ఏళ్లుగా విడదీయరాని అనుబంధం ఏర్పడిందని, మొదట్లో రెండు, మూడు చిలుకలకు కొన్ని బియ్యం గింజలు వేసేవాడనని , కొన్ని రోజులకు చిలుకలు గుంపుగా రావడం మొదలైందని లక్ష్మీనారాయణ రెడ్డి అంటున్నారు. రోజూ పక్షులు కిలకిలరావాలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.