ప్రకృతి సహజ సిద్ధమైన విశాఖ మన్యం మేఘ మాలను వీక్షించేందుకు పర్యాటకులు సందడి ఎక్కువయింది వయసుతో నిమిత్తం లేకుండా ప్రకృతి రమణీయమైన మేఘాల్లో కొండను ఎక్కి శ్వేత సముద్రమైన మేఘాల సమూహాన్ని తిలకించి ఆనందంలో మునిగితేలారు. వాయిస్: విశాఖ పాడేరు ఏజెన్సీ వంజంగి కొండల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు సుదూర ప్రాంతాల నుంచి కార్లు ద్విచక్ర వాహనాలు ప్రయాణించి మేఘాల కొండను వీక్షించారు గత నెల రోజులుగా అల్పపీడన వాతావరణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా పర్యాటకులు వచ్చారు పచ్చని కొండల మధ్య తేలియాడే పాల సముద్రం లాంటి మేఘాల సమూహాన్ని వీక్షించి తన్మయత్వం పొందారు ఓ పక్కన పచ్చని చెట్ల సమూహం మధ్యలో కొండలు మధ్య మధ్యలో మేఘాలు చల్ల గాలి చలి వాతావరణం కలిగి ఉండడంతో మరింత అనుభూతి పెరిగింది పర్యాటకులు తమ వాహనాలను అత్యంత కష్టం పై కొండ పైకి ఎక్కించారు అక్కడినుంచి రెండు కిలోమీటర్లు నడిచి మేఘాలు కొండని వీక్షించారు వారి వారి అనుభూతులు ఈటీవీ తో పంచుకున్నారు.