VIZAGVISION:CC Camera’s Nigha Vizag City.Visakhapatnam.
విశాఖ నగరంలో కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరంలోని ప్రధాన రహదారుల్లో నిఘా కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏతే పూర్తి స్ధఆయిలో మాత్రం ఇంకా కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారుల్లో రెండు వేలకు పైగా అధునాతన కెమెరాలను అమర్చి వీటన్నిటినీ అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా వెంటనే అప్రమత్తమై నేరస్థుల కదలికలను వేగంగా గుర్తించడానికి వీలుగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా ఫైబర్ గ్రిడ్ వ్యవస్ధను నెలకొల్పింది. దీని ద్వారా కెబుల్, ఇంటర్ నెట్, ఫోన్ కనెక్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు ఫైబర్ గ్రిడ్ ద్వారానే నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 1500 నిఘా కెమెరాలను మంజూరు చేసింది. ఇప్పటికే 448 కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. నగరంలోని జాతీయ రహదారి, ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాలు, ఉద్యానవనాలు, వాణిజ్య కేంద్రాలు, బీచ్‌రోడ్డు తదితర ప్రాంతాలన్నింటిలోనూ రెండువేలకు పైగా కెమెరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అధునాతన కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పని చేస్తోంది. ఈ కేంద్రానికే మరికొన్ని హంగులద్ది అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం నగరంలో అతి తక్కువ సంఖ్యలోనే నిఘా కెమెరాలున్నాయి. నేరాలు చోటుచేసుకున్నపుడు కొన్ని ఆధారాలను సేకరించడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. కొత్త ప్రాజెక్టులో.. నగరంలోని కీలక ప్రాంతాలన్నింటిలోనూ కెమెరాలను అమర్చటం ద్వారా నిఘాను కట్టుదిట్టం చేయనున్నారు. ఎక్కడైనా నేరం జరిగితే.. స్థానికులు వెంటనే 100 నెంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇస్తే నేరగాళ్లపై క్షణాల్లో ట్రాకింగ్ పెడతారు. ఏ ఇంట్లో నేరం చేశాడు? అక్కడి నుంచి ఏఏ మార్గాల ద్వారా ఎటువైపు పారిపోవడానికి అవకాశాలున్నాయో.. ఆ మార్గాలను క్షణాల్లో గుర్తించి నిఘా కెమెరాల ద్వారా ఫూటేజీలను పరిశీలిస్తుంటారు. తద్వారా నేరగాళ్లను గుర్తిస్తారు. సాధారణంగా నేరస్థుల ట్రాకింగ్‌ను గుర్తించాలంటే.. వారి గుర్తులేమిటన్నదే కీలకం. బాధితులు కీలక సమాచారం అందించినపుడే ఇది సాధ్యమవుతుంది. నేరగాళ్ల దుస్తుల రంగులు, వినియోగించిన వాహనాల మోడల్, రంగు తదితర అంశాలు చెప్పాల్సి ఉంటుంది.అదే నిఘా కెమెరాలుంటే.. సుమారు 80 శాతం కేసులకు సంబంధించిన ఏదో ఒక ఆధారమో…. దర్యాప్తు విజయవంతంగా సాగించడానికి అవసరమైన ప్రాథమిక వివరాలో లభిస్తుంటాయి. బీచ్‌రోడ్డులోని దమీజా హత్య వ్యవహారంలోనూ కీలక సాక్ష్యాలు నిఘా కెమెరాల వల్లే లభించాయి.ఈ వ్యవస్థ ఏర్పాటుకు కమిషనరేట్ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై మ్యాక్స్, ఎన్సీసీ సంస్థలు కసరత్తు ప్రారంభించాయి. ఎక్కడెక్కడ కెమెరాలను ఏర్పాటు చేయవచ్చో అధ్యయనం చేస్తున్నాయి. సాధ్యమైనంత వేగంగా నూతన వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ఆయా సంస్థల ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు
బైట్
డి.నాగేంద్రకుమార్, సంయుక్త పోలీసు కమిషనర్