World Peace Day | 52nd Ascension | Pitashri Prajapita Brahma | Remembering brahma baba special on 18 january | Visakhapatnam పితాశ్రీ పూజ్య బ్రహ్మా బాబా గారి 52వ పుణ్య వర్ధంతి. జనవరి 18వ తేదీన ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంస్థ ముఖ్య సంస్థాపకుడు నవ యుగ నిర్మాత , భారత భాగ్య విధాత,మానవజాతికి మొదటి మానవుడు ప్రజాపిత బ్రహ్మ బాబా పుణ్య స్మృతి దినమును పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి యున్న బ్రహ్మకుమారీల రాజయోగం మెడిటేషన్ సేవా కేంద్రాలలో రాత్రి రెండు గంటల నుండి ప్రత్యేక ధ్యాన యోగాల విశేష శాంతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. విశ్వంలోని ప్రతి ఒక్క ఆత్మకు,పంచ తత్వాలప్రకృతికి విశేష శాంతిని కలిగించేందుకు పూర్తి మౌనవ్రతంతో విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈరోజు ప్రపంచ శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క రోజుగా ప్రకటించవచ్చు. నేడు నిత్య దైనందిక జీవితంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు,కుటుంబ కలహ క్లేశములు, అకాలమృత్యువులు, భయాందోళనలతో కూడిన అశాంతి వాతావరణము వ్యాపించి ఉన్నది కావున విశ్వశాంతి స్థాపకుడు, ఆధ్యాత్మిక విప్లవ వీరుడు అయిన పితాశ్రీ బ్రహ్మ బాబా గారి పుణ్యవర్ధంతి రోజున సీతమ్మధారలోని హెచ్ బి కాలనీ లో గల తమ స్థానిక సేవా కేంద్రంలో ఆదివారం రాత్రి రెండు గంటలకు విశ్వ శాంతి కొరకు అఖండ జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను శుభారంభం చేస్తామని బ్రహ్మకుమారి సోదరి రామేశ్వరి గారు తెలియజేశారు.జాతి మత కుల లింగ వర్ణ వయో భేదాలు లేకుండా సేవా కేంద్రాలకు విచ్చేసి కొన్ని క్షణాల కొరకైన మనశ్శాంతి, అనుభూతిని చేసేందుకు సవినయముగా అందరిని ఆహ్వానిస్తున్నామని ఆమె తెలియజేశారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/