VIZAGVISION: Rowdy sheeter Murdered at Arilova.Visakhapatnam…విశాఖలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ఆరిలోవలో సంపత్ అనే రౌడీ షీటర్ ను ప్రత్యర్ధులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. హత్యకు పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. సంపత్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. పోలీసు రికార్డుల్లో అతనిపై రౌడీ షీట్ ఉంది. ఆరిలోవ పాండురంగా పురం వద్ద ప్రత్యర్ధులు మాటు వేసి సంపత్ ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. పాత కక్షలే హత్యకు కారణం కావచ్చని ప్రాధమికంగా నిర్ధారించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.