ఒకే ఇంట్లో నలుగురు సజీవ దహనం (అనుమానస్పద మృతి) in Madhurawada Visakhapatnam Vizag Vision విశాఖలో విషాదం ఒకే ఇంట్లో నలుగురు సజీవ దహనం (అనుమానస్పద మృతి) నిద్రలేస్తూనే గ్రేటర్ విశాఖ మధురవాడ ప్రాంతం ఉలిక్కిపడింది. భార్య, భర్త ఇద్దరు కుమారులతో సహా తాము నివాసముంటున్న అపార్ట్ మెంట్ లోనే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సంఘటనా స్థలాన్ని బట్టి అగ్ని ప్రమాదం జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ మృతదేహాల పై ఉన్న గాయాలను బట్టి అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నారు. నగర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పి.యమ్ . పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ప్రమాద సంఘటన పోలీసులు మరియు స్ధానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి . విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కి చెందిన ఎన్ఆర్ఐ సుంకర బంగారు నాయుడు గ్రేటర్ విశాఖ మధురవాడ సమీపంలోని midhilapuri vuda colony ఆదిత్య ఫార్చ్యూన్ టవర్ లో భార్య ఇద్దరు కుమారులతో కుటుంబ సమేతంగా నివాసముంటున్నారు. భార్య నిర్మల హోమియో డాక్టర్ కాగా, పెద్ద కుమారుడు దీపక్ (22 years) ఎన్ ఐ టి పూర్తి చేసి ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షల కు సన్నద్ధం అవుతుండగా ,చిన్న కుమారుడు కాశ్యాప్ (19) ఇంజనీరింగ్చదువుతున్నాడు. స్వగ్రామం విజయనగరం జిల్లా అయినప్పటికీ వీరిది ఎన్ఆర్ఐ కుటుంబం . బహ్రెయిన్‌లో స్థిరపడింది. నాలుగేళ్ల క్రితం తిరిగి విశాఖపట్టనానికి వచ్చారు.. 8 నెలల క్రితమే ఆదిత్య ఫార్చున్ టవర్స్‌లోకి అద్దెకు వచ్చారు. ఆ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్నుఅద్దెకు తీసుకొని నివసిస్తుండగా ఈ ఘటన జరిగింది. వీరు నివాసముంటున్న ఆదిత్య ఫార్చున్ టవర్‌లో ఫ్లాట్ నెంబర్ 505లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్లాట్ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు కనిపించడంతో మిగతా ఫ్లాట్స్ వారు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఆ ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతులు బంగారునాయుడు (50), డాక్టర్ నిర్మల (44), దీపక్ (21), కశ్యప్ (19) గా పోలీసులు గుర్తించారు. ముందుగా అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు భావించినప్పటికీ, ముగ్గురి మృతదేహాల పై రక్తపుమడుగులో గాయాలు ఉండడం, పెద్ద కుమారుడు మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా హత్య చేశారా? లేదంటే వారే ఆత్మహత్య చేసుకున్నారా? అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్మెంట్ చట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు… రాజకీయ నేపథ్య కుటుంబం మృతులు బంగారు నాయుడు రాజకీయ నేపథ్యం కుటుంబం. తండ్రి సుంకర శ్రీరాములు గతంలో సమితి సర్పంచ్ గా పనిచేశారు. తన ఐదుగురు సోదరులలో నాల్గవ సోదరుడు శ్రీనివాస్ భార్య సుంకర సుజాత ఇటీవలే ఎంపీపీ అభ్యర్థిగా వైకాపా నుండి పోటీ చేశారు. మరో సోదరుడు వైజాగ్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు బంగారు నాయుడు కూడా వైజాగ్ లోనే స్థిరపడాలని ఇటీవలే స్థానిక మిర్జాపూర్ కూడా కాలనీలో ఓ ఫ్లాట్ తీసుకుని నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది. గౌరవ మర్యాదలతో పాటు అధికంగా స్థిరపడి ఆనందంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో ఇటువంటి విషాద సంఘటన చోటు చేసుకోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. కారణం ఏదైనప్పటికీ కాలం కక్షకట్టి కుటుంబం మొత్తాన్ని కాటేయడం స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/