మన్యంలో ఇటుకల పండుగ సందడి | Brick Festival in Agency | Paderu | Visakhapatnam | Vizag Vision మన్యంలో ఇటుకల పండుగ సందడి చైత్రమాసం వస్తేచాలు నెల రోజుల పాటు గ్రామాల్లో ఫుల్ జోష్ గిరిజన సంస్కృతిని అర్థం పట్టేలా ఈ పండుగ శంకు దేవుడికి గిరిజన మహిళలు ఆట పాటలతో ప్రత్యేక పూజలు గిరిజన ప్రాంతంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పాడేరు-:-డివిజన్ పరిధిలో అన్ని మండలాల్లో ఈ ఇటుకల పండుగలకు గిరిజన సాంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించడం ఆనవాయితీ ప్రతి ఏటా చైత్ర మాసంలో వచ్చే ఇటుకల పండుగకు ఉండే ప్రత్యేకతే వేరు గిరిజనుల ఐక్యతను వారి సంస్కృతిని అద్దంపట్టేలా ఇటుకల పండుగను గిరిజన ప్రాంతంలో నిర్వహిస్తుంటారు.మన్యంలో ఇటుకల పండుగ సందడి మొదలైంది.గిరిజన గ్రామాల్లో నెలరోజులపాటు ఈ పండుగ సందడి ఉంటుంది.పండుగ మొదటి వారం వ్యవసాయానికి సంబందించి గ్రామల్లో కొలివైయున్న దేవుళ్ళకు ప్రత్యేక పూజలు చేస్తారు.ప్రధానంగా రోడ్డు మార్గంలో గ్రామాల్లోని రోడ్లుపై గిరిజన మహిళలు ప్రధానంగా గిరిజన యువతులు కర్రలతో గేట్లు ఏర్పాటు చేసుకుని ఆ మార్గంలో వచ్చిన వాహనదారుల నుంచి బాటసారుల నుంచి చందా వసూలు చేయడం ఆనవాయితీ చందా ఇవ్వని వారికి పేడ నీళ్లు రంగునీళ్లు కలిపి సరదాగా పోస్తారు గ్రామాలకు వచ్చినవారికి మహిళలంతా కలిసి చెంబు నీళ్లతో పోస్తారు వారం రోజులపాటు వసూలు చేసిన చందా డబ్బులను ఒకే దగ్గర కూడబెట్టి చివరకు రోజు మహిళలంతా ఏదో ఒక వస్తువును కొనుక్కుని సరిసమానంగా వచ్చే సందా డబ్బులు పంచుకోవడం గిరిజన మహిళల యొక్క సంప్రదాయబద్దంగా గిరిజన మహిళలు ఈ ఇటుకల పండుగ చేసుకుంటారు #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/