VIZAGVISION:After Reciving Vice-President Venkaiah Naidu in Andhra Pradesh,Vijayawada.Visakhapatnam…ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా స్వరాష్ట్రానికి విచ్చేసిన వెంకయ్యనాయుడుకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వాగత ర్యాలీ ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
లక్ష మందితో 23 కి.మీ మేర ప్రకాశం బ్యారేజీ వరకు ఈ స్వాగత ర్యాలీ కొనసాగనుంది. అనంతరం రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతికి పౌర సన్మానం జరగనుంది.